![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -93 లో.. కృష్ణ తన మాటలతో డాక్టర్ గౌతమ్ కి చిరాకు తెప్పిస్తుంది. గౌతమ్ ఒక ఫోటోని చూస్తూ ఎమోషనల్ అవ్వగా.. ఆ ఫోటో ఏంటి సర్ అని అడిగేసరికి గౌతమ్ కి కోపం వచ్చి.. "ఇక్కడ నుండి వెళ్ళిపో" అని అంటాడు. ఏమైనా పని ఉంటే చెప్పండి సర్ చేస్తానని కృష్ణ అనడంతో.. రెండు ఫైల్స్ ఇచ్చి ఇవి రేపటివరకు రాసుకొని రా అని చెప్తాడు. ఇవ్వన్నీ ఒక్క రోజులో ఎలా రాయాలంటూ బాధగా అంటుంది. ఇంకా రెండు కావాలా అని గౌతమ్ అనేసరికి.. వద్దు వద్దు సర్ ఇవి చాలని కృష్ణ చెప్పి బయటకొచ్చేస్తుంది. అప్పుడే కృష్ణని తీసుకొని వెళ్ళడానికి వచ్చిన మురారిని చూసి హడావిడి గా కార్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఏమైంది కృష్ణ అని మురారి అడగడంతో.. "ఇంట్లో భవాని అత్తయ్య పులి అయితే ఇక్కడ పరిమళ మేడం సింహం. ఇప్పుడు ఇంకొక సర్ గౌతమ్ సర్.. పరమ శివుడు మూడో కన్ను తెరిచినట్లుగా తన కోపం ఉంటుందని కృష్ణ చెప్తుంది. ఒక్క రోజులోనే ఒక మనిషి గురించి స్టడీ చేసావ్.. నువ్వు చాలా గ్రేట్ కృష్ణ అని మురారి అంటాడు.
ఆ తర్వాత కృష్ణ, మురారి ఇంటికి వస్తారు. అప్పటికే కృష్ణ కోసం ఎదురుచూస్తూ ఏమీ తినకుండా నందిని మారాం చేస్తుంది. కృష్ణ నువ్వు వచ్చావా అంటూ దగ్గరికి వెళ్తుంది. అన్నం తిన్నావా నందు? అని కృష్ణ అనగానే.. నువ్వు వచ్చాకే తింటానని నందు అంటుందని ముకుంద చెబుతుంది. మురారి ఫ్రెష్ అప్ అయి వస్తానని తన గదిలోకి వెళ్తాడు. అప్పుడే కృష్ణ దగ్గరికి భవాని వచ్చి.. ఇంట్లో పనులు ఎక్కడివక్కడే వదిలేసి వెళ్లిపోయావా? ముకుంద ఒక్కతే ఇంట్లో పనులు వంట పనులు చూసుకుంటుందా అని భవాని అడుగుతుంది. లేదు అత్తయ్యా.. నేను ముకుందకి హెల్ప్ చేస్తా అంటే తనే వద్దు అందని కృష్ణ చెప్తుంది.
లేదు అత్తయ్య కృష్ణ, మురారి ఇద్దరు కాలేజీకి రెడీ అయి వెళ్ళేటప్పుడు.. హెల్ప్ చేయాలా అని అడిగింది.. అప్పుడు కాలేజీకి వెళ్తున్నావ్ గా.. వద్దులే అని చెప్పానని ముకుంద అంటుంది. కాలేజీకి వెళ్తుంటే బాక్స్ ఇచ్చి వెళ్ళమని చెప్పి ఇంటికొచ్చేసరికి ఇదంతా రాద్దాంతం చేస్తావా ముకుంద అని కృష్ణ అడుగుతుంది. ఏంటి కృష్ణా.. ఆ మాటలు చిన్న పెద్ద లేకుండా.. అయినా ఇంట్లో ఎవరి పనులు వారే చేసుకోవాలి. నువ్వు ఇంట్లో పని అయ్యాకే కాలేజీకి వెళ్ళాలి అని భవాని చెప్తుంది. "సరే అతయ్యా.. ఇంట్లో పని అయ్యాకే వెళ్తాను.. ఇంకా ఎవరికి అనే ఛాన్స్ ఇవ్వను" అని ముకుందని ఉద్దేశించి కృష్ణ అంటుంది.
ఆ తర్వాత తన గదిలో ఉన్న రేవతి దగ్గరికి కృష్ణ టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళి.. "ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్యా" అని అడుగుతుంది. పర్లేదమ్మా బానే ఉంది.. కాలేజీకి వెళ్ళావా అంటూ రేవతి అడుగుతుంది. వెళ్ళానని చెప్పి ముకుంద చేసిన గొడవ గురించి రేవతికి చెప్తుంది కృష్ణ. ఏంటి ఈ ముకుంద వాలెంటైన్స్ డే నుండి ఇలా ప్రవర్తిస్తుందని రేవతి అనుకుంటుంది. కాసేపటికి కృష్ణని వెతుకుతూ మురారి అటు ఇటు తిరుగుతుండగా.. ముకుంద ఎదురుపడి కృష్ణ కోసం చూస్తున్నావా? ఆ నందు తో తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ ఉంటుందని ముకుంద అంటుంది. అవునా.. అది మంచి పనే కదా అని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |